News September 19, 2025
మాజీ సీఎం జగన్ రూట్ మార్పు

తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన వైఎస్ జగన్ ప్రయాణంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో జగన్ వాహనశ్రేణి ప్రకాశం బ్యారేజీ మీదుగా గన్నవరం బయలుదేరింది.
Similar News
News September 19, 2025
డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.
News September 19, 2025
గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం

రాబోయే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టిక్కెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గుంటూరు స్టేషన్‌లో సిబ్బంది ధరించే జాకెట్ల వెనుక భాగాన క్యూఆర్ కోడ్ అమర్చారు. ప్రయాణికులు యూటీఎస్, రైల్ వన్ యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి కాగిత రహిత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇకపై 5KM లోపు ఇంటి నుంచే జనరల్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది.
News September 19, 2025
గుంటూరు జిల్లా రైతులకు శుభవార్త

గుంటూరు జిల్లాలో రైతుల అవసరాల నిమిత్తం తాజా ఎరువుల సరఫరా జరిగింది. గురువారం రెడ్డిపాలెం రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు 330 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్ల ద్వారా చేరింది. స్టాక్‌ను ఏడీఏ మెహనరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాకు వచ్చిన ఈ సరఫరాలో మార్క్‌ఫెడ్‌కు 250 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్లకు 80 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.