News September 19, 2025
అమరావతి: $1.6 బిలియన్ల రుణానికి కేంద్రం ఓకే

AP: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో 1.6 బిలియన్ డాలర్ల (రూ.14వేల కోట్లు) రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఇప్పటికే ఈ రెండు అంతర్జాతీయ బ్యాంకులు 1.6 బిలియన్ డాలర్ల రుణం అందిస్తున్నాయి. హడ్కో మరో రూ.11వేల కోట్ల లోన్ ఇస్తోంది. అదనపు రుణం మంజూరైతే మొత్తం రూ.40 వేల కోట్లు అందుబాటులోకి వచ్చి, పనులు వేగవంతం కానున్నాయి.
Similar News
News January 19, 2026
స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టండిలా!

డెలివరీ అయిన తర్వాత చాలామంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటిని ఎలా తొలగించుకోవాలంటే.. * ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, 15నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత హీటింగ్ ప్యాడ్‌ను ఆ మార్క్స్‌పై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా నెలరోజులు చెయ్యాలి. * కలబంద గుజ్జును స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, మూడు గంటల పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయాలి.
News January 19, 2026
అమరావతికి స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు

AP: అమరావతికి స్వయంప్రతిపత్తి కల్పించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. తొలిసారిగా ప్రపంచబ్యాంకు, ADB రూల్స్‌కు అనుగుణమైన రీతిలో పాలనా వ్యవహారాలు సాగేలా ఇవి ఉండనున్నాయి. ఆర్థిక అవసరాలు తీరేలా భూములు అమ్ముకొనే వీలు కల్పించనున్నారు. వనరులను మదింపుచేసి స్థిరమైన రాబడి కోసం పెట్టుబడులు వచ్చేలా ఫ్రేమ్‌వర్కును ఏర్పరుస్తారు. పాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుత MNP చట్టాలనూ మారుస్తారు.
News January 19, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


