News September 19, 2025

మహబూబాబాద్: ఐదుగురి కోసం 9 మంది..!

image

నెల్లికుదురు(M) రాజులకొత్తపల్లి జడ్పీ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తుండటం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆరో తరగతిలో ఒకరు, ఏడో తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 9, 10వ తరగతుల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. పాఠశాల తెరిచి 3 నెలలు గడిచినా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Similar News

News September 19, 2025

జూబ్లీహిల్స్‌లో ఆసక్తికరంగా కాంగ్రెస్ సమీకరణలు..!

image

HYD జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హామీ పేరుతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని డివిజన్ల నేతలతో అంజన్ కుమార్ యాదవ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ వద్ద నుంచి అంజన్ కుమార్ యాదవ్‌కు సానుకూల సంకేతాలు వచ్చాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

News September 19, 2025

అసెంబ్లీ సమావేశాలు వాయిదా

image

AP అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు సందర్భంగా పలు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

News September 19, 2025

VZM: ఉద్యోగుల నుంచి 40 వినతులు స్వీకరణ

image

విజయనగరం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగుల గ్రీవన్స్‌కు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి 40 వినతులు అందాయి. ఈ వినతులను కలెక్టర్, JC సేతు మాధవన్, RDO శ్రీనివాస మూర్తి స్వీకరించగా జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ రామసుందర రెడ్డి మాట్లాడుతూ.. అందిన వినతుల్లో జిల్లా స్థాయిలో ఉన్నవి పరిష్కరించాలని, కానివి రాష్ట్ర స్థాయికి పంపాలన్నారు.