News September 19, 2025

58 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 58 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి. జాబ్స్‌ను బట్టి ఎకనామిక్స్/కామర్స్‌లో డిగ్రీ, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ఉద్యోగాన్ని బట్టి జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ OCT 9.
వెబ్‌సైట్: <>https://bankofbaroda.bank.in/<<>>
#ShareIt

Similar News

News September 19, 2025

జూ.ఎన్టీఆర్ ఎలా గాయపడ్డారంటే?

image

ఓ ప్రైవేట్ యాడ్ షూట్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్ <<17762493>>గాయపడ్డ<<>> విషయం తెలిసిందే. సెట్లో చీకటి ఉండటంతో స్టేజీ ఎడ్జ్ నుంచి ఆయన జారి కిందపడ్డట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో తారక్ పక్కటెముకలు, చేతికి స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. చికిత్స అనంతరం తారక్ ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

News September 19, 2025

అసెంబ్లీ సమావేశాలు వాయిదా

image

AP అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు సందర్భంగా పలు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

News September 19, 2025

పులివెందులకు కూడా మేమే నీళ్లిచ్చాం: CBN

image

ఏపీ, తెలంగాణలో మెజార్టీ ప్రాజెక్టులు తానే ప్రారంభించానని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఇప్పుడు రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నట్లు చెప్పారు. గతంలో పులివెందులకు కూడా తామే నీళ్లిచ్చామన్నారు. కుప్పానికి కృష్ణా జలాలు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందని సీఎం వెల్లడించారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.