News September 19, 2025
జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. నిమ్స్‌లో మీడియా సెంటర్

నిమ్స్ ఆస్పత్రిలో జర్నలిస్టులు, అధికారులకు వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సమాచారం కోసం వచ్చే మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం మీడియా సెల్ ఏర్పాటు చేశామని ఆస్పత్రి మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్ తెలిపారు. అక్కడే పార్కింగ్ సదుపాయమూ కల్పించామన్నారు. జర్నలిస్టులకు సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్న అంశాలపై యాజమాన్యం దృష్టి సారించిందన్నారు.
Similar News
News September 19, 2025
జూబ్లీహిల్స్‌లో ఆసక్తికరంగా కాంగ్రెస్ సమీకరణలు..!

HYD జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హామీ పేరుతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని డివిజన్ల నేతలతో అంజన్ కుమార్ యాదవ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ వద్ద నుంచి అంజన్ కుమార్ యాదవ్‌కు సానుకూల సంకేతాలు వచ్చాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.
News September 19, 2025
HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
News September 19, 2025
HYD: సచివాలయంలో హెల్త్ మినిస్టర్ సమీక్ష

HYDలోని తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ సాగుతోంది. కొత్తగా నిర్మిస్తోన్న ఆసుపత్రులతోపాటు మరికొన్ని ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.