News September 19, 2025
దేశంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 48వ స్థానం

ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్- 2025లో ఉస్మానియా మెడికల్ కాలేజీ 51.46 స్కోరుతో వరుసగా రెండోసారి 48వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ కోసం దేశ వ్యాప్తంగా 223 మెడికల్ కాలేజీలు పోటీ పడ్డాయి. ఎయిమ్స్ (న్యూఢిల్లీ) 1వ ర్యాంకులో నిలవగా PGIMER (చండీగఢ్), CMC (వెల్లూర్), జిప్మర్ (పాండిచేరి) మొదటి 3 ర్యాంకుల్లో నిలిచాయి.
Similar News
News September 19, 2025
భీమవరం: ఈవీఎంల భద్రతను తనిఖీ చేసిన కలెక్టర్

కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం భీమవరంలోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో ఆమె సంతకం చేశారు. పలు సూచనలను కలెక్టర్ అందజేశారు. విధుల్లో ఉన్న పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News September 19, 2025
కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.
News September 19, 2025
ఆధార్ నమోదు లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో 192 ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, అన్ని కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. 0-5 ఏళ్ల పిల్లలకు ఆధార్ నమోదు, 5-7 ఏళ్ల వారికి వేలిముద్రలు, 15-17 ఏళ్ల వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని ఆదేశించారు. ‘తల్లికి వందనం’ వంటి పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు.