News September 19, 2025
ఆ ఒక్క టెస్టుతో రెండు జబ్బులూ గుర్తించొచ్చు..

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మామోగ్రామ్ టెస్టు ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గుర్తించే ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి దీనికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్’ వైద్య పత్రికలో ప్రచురించారు. ఈ టూల్‌తో రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదాన్ని గుర్తించొచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జెన్నిఫర్ తెలిపారు.
Similar News
News September 19, 2025
నేను రాలేదు.. కాంగ్రెస్సే నన్ను బయటకి పంపింది: తీన్మార్ మల్లన్న

TG: కాంగ్రెస్ నుంచి తాను బయటికి రాలేదని, ఆ పార్టీయే తనను బయటకు పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ముగిశాక నా ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిద్దాం. సీఎం రేవంత్ బీసీల ద్రోహి. భూమిలేని రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలి. వరంగల్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలి. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం’ అని తెలిపారు.
News September 19, 2025
కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.
News September 19, 2025
మరో 474 పార్టీలను తొలగించిన EC

ఎలక్షన్ కమిషన్(EC) దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రక్షాళన చేపట్టింది. జూన్ నుంచి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యాక్టివ్‌గా లేని మొత్తం 808 పార్టీలను తొలగించింది. ఆగస్టు 9న 334, తాజాగా రెండో ఫేజ్‌లో 474 పార్టీలను లిస్ట్ నుంచి తీసేసింది. అత్యధికంగా UPలో 121, APలో 17 పార్టీలపై వేటు పడింది. ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను EC తొలగిస్తోంది. 3వ ఫేజ్‌లో 359 పార్టీలు పరిశీలనలో ఉన్నాయి.