News September 19, 2025
HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.
Similar News
News September 19, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల మండలం చలి చీమల పల్లి వద్ద జరిగే నేషనల్ హైవే పనులను పరిశీలించారు. చెరువు వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.
News September 19, 2025
గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి కృషి చేయాలి: ADB ఎస్పీ

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. వీడీసీల ఆగడాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. రౌడీలు, కేడీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠినమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.
News September 19, 2025
పోక్సో బాధితులకు అండగా నిలవాలి – కలెక్టర్ శ్రీహర్ష

బాలికలపై లైంగిక దాడుల నియంత్రణకు యంత్రాంగం అండగా నిలవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పోక్సో చట్టంపై శుక్రవారం జరిగిన శిక్షణలో ఆయన మాట్లాడారు. బాధితులకు ధైర్యం కల్పించి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సెక్షన్ 19 ప్రకారం ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.