News September 19, 2025

వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

image

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.

Similar News

News September 19, 2025

స్పీకర్ కార్యాలయమే కోర్టు

image

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కోర్టుగా మారనుంది. పార్టీ ఫిరాయింపులపై BRS ఫిర్యాదుకు కడియం, దానం మినహా మిగతా 8 మంది స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని BRSకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖ రాశారు. దీంతో వచ్చే వారంలో స్పీకర్ ఛాంబర్‌లో అటు BRS, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదనలు విన్పించనున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయమూర్తి తరహాలో నిర్ణయం తీసుకుంటారు.

News September 19, 2025

రేపు రాయలసీమలో భారీ వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది.

News September 19, 2025

ASIA CUP: టాస్ గెలిచిన భారత్

image

ఒమన్‌తో మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ బౌలర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చారు. వారి స్థానంలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్, గిల్, సూర్య, తిలక్, సంజూ, దూబే, హార్దిక్, అక్షర్, కుల్దీప్, హర్షిత్, అర్ష్‌దీప్ సింగ్
OMAN: కలీమ్, జతిందర్, హమ్మద్ మిర్జా, వినాయక్, షా ఫైజల్, జిక్రియా, ఆర్యన్ బిస్త్, నదీమ్, షకీల్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రామనంది.