News September 19, 2025
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి <<17735732>>అంతర పంటలు<<>>గా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.
Similar News
News September 19, 2025
రేపు రాయలసీమలో భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది.
News September 19, 2025
ASIA CUP: టాస్ గెలిచిన భారత్

ఒమన్‌తో మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్ బౌలర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చారు. వారి స్థానంలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చారు.
IND: అభిషేక్, గిల్, సూర్య, తిలక్, సంజూ, దూబే, హార్దిక్, అక్షర్, కుల్దీప్, హర్షిత్, అర్ష్‌దీప్ సింగ్
OMAN: కలీమ్, జతిందర్, హమ్మద్ మిర్జా, వినాయక్, షా ఫైజల్, జిక్రియా, ఆర్యన్ బిస్త్, నదీమ్, షకీల్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రామనంది.
News September 19, 2025
ఉల్లి రైతులకు సీఎం శుభవార్త

AP: సీఎం చంద్రబాబు ఉల్లి రైతులకు శుభవార్త చెప్పారు. హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైతుల సమస్యపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.100 కోట్ల మేర అదనపు భారం భరించాలని నిర్ణయించారు.