News September 19, 2025

GWL: ‘రేవులపల్లిలో బ్రిడ్జి నిర్మించాలి’

image

రేవులపల్లి-నందిమల్ల మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి పరిసర గ్రామాల ప్రజలు కోరారు. కాంగ్రెస్ గద్వాల ఇన్‌ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్ 28న జూరాల సందర్శన సమయంలో బ్రిడ్జిని ప్రాజెక్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని మీరు ప్రతిపాదించారని, ఇప్పుడు బ్రిడ్జిని మరోచోట నిర్మించేందుకు కుట్ర జరుగుతోందని ఆయనకు వివరించారు.

Similar News

News September 19, 2025

సింగరేణి సంస్థ C&MDకి అత్యుత్తమ పురస్కారం

image

సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న సీఅండ్‌ఎండీ బలరాం నాయక్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఏషియా పసిఫిక్ హెచ్‌ఆర్‌ఎం (HRM) కాంగ్రెస్ వారు ఆయనను దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ సంస్థల కేటగిరీలో సీఅండ్‌ఎండీగా గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశారు. గురువారం రాత్రి బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

News September 19, 2025

స్పీకర్ కార్యాలయమే కోర్టు

image

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కోర్టుగా మారనుంది. పార్టీ ఫిరాయింపులపై BRS ఫిర్యాదుకు కడియం, దానం మినహా మిగతా 8 మంది స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని BRSకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖ రాశారు. దీంతో వచ్చే వారంలో స్పీకర్ ఛాంబర్‌లో అటు BRS, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదనలు విన్పించనున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయమూర్తి తరహాలో నిర్ణయం తీసుకుంటారు.

News September 19, 2025

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన మేయర్ బృందం

image

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.