News September 19, 2025
విజయవాడ: క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన

దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో కాలినడకన పర్యటించి పరిశీలించారు. ఈ ఏడాది భక్తులకు మధురానుభూతులను మిగిల్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News September 19, 2025
స్పీకర్ కార్యాలయమే కోర్టు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కోర్టుగా మారనుంది. పార్టీ ఫిరాయింపులపై BRS ఫిర్యాదుకు కడియం, దానం మినహా మిగతా 8 మంది స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని BRSకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖ రాశారు. దీంతో వచ్చే వారంలో స్పీకర్ ఛాంబర్‌లో అటు BRS, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదనలు విన్పించనున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయమూర్తి తరహాలో నిర్ణయం తీసుకుంటారు.
News September 19, 2025
జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన మేయర్ బృందం

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.
News September 19, 2025
HYD: BRS జైత్రయాత్రతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలి: KTR

420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ BRS జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం HYD తెలంగాణ భవన్‌లో ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని స్పష్టం చేశారు.