News September 19, 2025
భారత్‌ను ఓడించిన కివీసే మా స్ఫూర్తి: WI కోచ్

భారత్‌లో ఆడే టెస్ట్ సిరీస్‌లో రాణించేందుకు న్యూజిలాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ అన్నారు. ‘గత ఏడాది ఇండియాలో NZ 3-0 తేడాతో సిరీస్ గెలిచింది. గెలిచేందుకు 20 వికెట్లు తీయాలి. మా పేసర్లకు ఆ సత్తా ఉంది. గెలవాలనే మైండ్ సెట్‌తోనే ఇండియా టూరుకు వెళ్తాం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. IND, WI మధ్య అక్టోబర్ 2 నుంచి తొలి టెస్ట్, 10 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.
Similar News
News September 19, 2025
ఐదుగురు విద్యార్థులకు 9 మంది టీచర్లు!

TG: ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో సర్కారు బడుల్లో చేరే వారి సంఖ్య పెరగడం లేదు. మహబూబాబాద్(D) రాజులకొత్తపల్లి ZPHSలో ఐదుగురు విద్యార్థులకు 9మంది టీచర్లుండటమే ఇందుకు నిదర్శనం. ఈ స్కూలులో 6thలో ఒకరు, 7thలో ఇద్దరు, 8thలో ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. 9th, 10thలో ఒక్కరూ లేరు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.
News September 19, 2025
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సరిహద్దుల ఖరారుపై కమిటీ

AP: ఓబుళాపురం మైనింగ్ కేసులో సరిహద్దుల ఖరారుపై జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. సరిహద్దు వివాదం ముగిసిందని, మైనింగ్ కొనసాగించడానికి గాలి బ్రదర్స్‌కి అనుమతి ఇవ్వాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
News September 19, 2025
స్పీకర్ కార్యాలయమే కోర్టు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కోర్టుగా మారనుంది. పార్టీ ఫిరాయింపులపై BRS ఫిర్యాదుకు కడియం, దానం మినహా మిగతా 8 మంది స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని BRSకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖ రాశారు. దీంతో వచ్చే వారంలో స్పీకర్ ఛాంబర్‌లో అటు BRS, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదనలు విన్పించనున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయమూర్తి తరహాలో నిర్ణయం తీసుకుంటారు.