News September 19, 2025
కాకినాడ: టీడీపీలో చేరనున్న కర్రి పద్మశ్రీ

కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇవాళ సాయంత్రం టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ హయాంలో గవర్నర్ కోటాలో ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ముగిసిన తర్వాత సీఎం సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ పద్మశ్రీ భర్త నారాయణరావు Way2Newsకు ఫోన్‌లో తెలియజేశారు. కాగా ఆమె రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.
Similar News
News September 19, 2025
లబ్ధిదారులకు నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి: జేసీ

జిల్లాలో దీపం పధకం 2 లబ్ధిదారులు 1,257 మందికి సబ్సిడీ నగదు ఖాతాలలో నమోదు కావడం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈమేరకు నగదు జమపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి శుక్రవారం కలక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీలు, సివిల్ సప్లయ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 1,257 మంది జాబితాను గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లకు పంపాలని జిల్లా సప్లయ్ అధికారికి జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
News September 19, 2025
PDPL: విద్యార్థులకు మెరుగైన బోధనపై దృష్టి : కలెక్టర్

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదర్శ పాఠశాలలు, కేజిబీవీ పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు కచ్చితంగా నమోదుచేయాలని, గైర్హాజరైన వారికి రెగ్యులర్ ఫాలో అఫ్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, అకాడమిక్ ఫలితాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు.
News September 19, 2025
ఏలూరు: ఆక్వా రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం

ఏలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆక్వా, చేపల చెరువుల రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు విద్యుత్ సమస్యలు, సర్ చార్జి, అడిషనల్ చార్జి, అధిక బిల్లుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. చెరువులకు అప్రోచ్ రోడ్ల నిర్మాణాల గురించి వారు ప్రస్తావించారు.