News September 19, 2025

సంగారెడ్డి: ‘న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తీసుకురండి’

image

న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరారు. న్యాయవాదుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

MBNR: మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక సమావేశం

image

మహిళలు, బాలికలు, పిల్లల భద్రతకు సంబంధించి పోలీసులతో సమన్వయం చేసుకోడానికి CID SP అన్యోన్య ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. భరోసా, షీ టీమ్, AHTU, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషించాలని SP సూచించారు. అదనపు SP NB రత్నం, DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

సీతారామ ప్రాజెక్ట్ భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌లో భూ సేకరణ, అటవీ సమస్యలు ఆలస్యానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న భూముల బదలాయింపు, అవార్డులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల సర్వే 20 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు.

News September 19, 2025

VJA: విధుల్లో నిర్లక్ష్యం.. అధికారికి షోకాజ్ నోటీసు

image

ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరగనున్న దసరా మహోత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబుపై కలెక్టర్ లక్ష్మీశా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తన కార్యాలయం ద్వారా రాంబాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు.