News September 19, 2025
చీఫ్ ఇంజినీర్ ముందే బీఎన్ పనులు చేయలేమన్న కాంట్రాక్టర్

R&Bచీఫ్ ఇంజనీర్ (NDB) విజయశ్రీ ముందే రోడ్డు మరమ్మతులు చేయలేమని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB)నిధులతో నిర్మాణంలో ఉన్న జిల్లాలోని రోడ్లు శుక్రవారం పరిశీలించారు. బి.ఎన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలును పూడ్చాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరావును ఆదేశించారు. ఇప్పటికే ఈ రోడ్డు పనులకు రూ.10 కోట్లు వెచ్చించామని ఇంతవరకు ఈ బిల్లు ఇవ్వనందున ఇక పనులు చేయలేమన్నారు.
Similar News
News September 19, 2025
‘OG’ ప్రీమియర్లకు అనుమతి

TG: పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా ప్రీమియర్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా ఈనెల 25న రిలీజ్ కానుండగా, 24న రాత్రి 9గంటలకు ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ షో టికెట్ ధర రూ.800(GSTతో కలిపి)గా నిర్ణయించింది. సినిమా రిలీజైన పది రోజుల వరకు టికెట్‌పై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100(GSTతో కలిపి), మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునే వెసులుబాటు కల్పించింది.
News September 19, 2025
నెల్లూరు: గూడ్స్ రైలు కింది పడిన స్నేహితులు

నెల్లూరులోని వెంకటేశ్వరపురం మూడో రైల్వే లైనుపై ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. రైల్వే SI హరిచందన వివరాలు.. చిత్తూరు(D) పూతలపట్టుకు చెందిన ఉమేష్ చంద్ర(25), పొదలకూరుకు చెందిన వంశీ స్నేహితులు. వీరు గూడ్స్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉమేష్ చంద్ర మృతిచెందగా, వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చేర్పించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 19, 2025
అనంతపురంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

అనంతపురం నగర శివారులోని సోమలదొడ్డి వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.