News September 19, 2025

నల్గొండ: ‘నా కోరిక తీరిస్తే B.Ed పాస్ చేస్తా’

image

నల్గొండలోని డైట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు B.Ed విద్యార్థినిని వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీరిస్తే B.Ed పాస్ చేయిస్తానని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న బాలికలకు ముద్దులు పెట్టడం, వెకిలి చేష్టలకు పాల్పడటంతో అతడిని దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News September 19, 2025

అనంతపురంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అనంతపురం నగర శివారులోని సోమలదొడ్డి వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 19, 2025

కృష్ణా: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

image

కృష్ణా జిల్లా నూతన ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ న్యాయమూర్తికి మొక్కను అందజేశారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పరస్పర సహకారంతో ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. నేరస్తులకు త్వరితగతిన శిక్ష విధించేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఎస్పీ తెలిపారు.

News September 19, 2025

VJA: ఆసియా ఫెన్సింగ్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు

image

ఉత్తరాఖండ్‌లో జరగనున్న ఆసియా ఫెన్సింగ్ క్రీడలకు ఎంపికైన రాష్ట్ర క్రీడా కారులను కృష్ణా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ అభినందించారు. సేబర్ విభాగం శేషు, రిషిత్, ఈపీ విభాగం లిఖిత, చిన్మయి శ్రియ ఎంపికయ్యారు. జిల్లాలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న క్రీడా కారులు ఉన్నారని, భవిష్యత్తులో వారిని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.