News April 5, 2024
నెల్లూరు: న్యాయమూర్తుల బదిలీ

నెల్లూరు ప్రత్యేక ఏసీబీ కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. కడపలో పనిచేస్తున్న గీతను నెల్లూరు ప్రత్యేక మహిళా కోర్టు, 8వ అదనపు సెషన్స్ జడ్జిగా నియమించారు. నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీనారాయణను గుడివాడకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో చిత్తూరు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న కరుణకుమార్ నియమితులయ్యారు.
Similar News
News April 21, 2025
వడ్డీతో సహా చెల్లిస్తాం: మేకపాటి

కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని వైసీపీ ఉదయగిరి ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
News April 21, 2025
1న నెల్లూరు జిల్లాకు సీఎం రాక

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన మే 1న ఆత్మకూరుకు రానున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ఉన్న హెలిప్యాడ్‌ను ఆర్డీవో పావని, పోలీసులు పరిశీలించారు. సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
News April 21, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో ఉచిత భోజనం

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వీరికి కలెక్టర్ ఓ.ఆనంద్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.