News September 19, 2025
మంచిర్యాల: స్టాండడైజేషన్ కమిటీ సమావేశంలో జనక్ ప్రసాద్

కోల్ ఇండియా JBCCI-Xl స్టాండైజేషన్ కమిటీలో INTUC యూనియన్‌కు చోటు దక్కింది. ఈ మేరకు కోల్‌కత్తా హైకోర్టు తీర్పు వెలువడించింది. దీంతో ఈనెల 22న జరగనున్న 6వ JBCCI-Xl స్టాండడైజేషన్ కమిటీ సమావేశంలో INTUC యూనియన్ పాల్గొననుంది. ఆల్టర్నేట్ సభ్యులుగా INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పేరును ఫెడరేషన్ ప్రతిపాదించింది. దీంతో సింగరేణి యూనియన్ నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News September 19, 2025
KNR: బతుకమ్మ, దసరా పండుగ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ నెల 20వ తేదీ (రేపటి) నుంచి OCT 1వ తేదీ వరకు JBS నుండి KNRకు 1321 బస్సులు, OCT 2వ తేదీ నుంచి 13 తేదీ వరకు KNR నుంచి JBSకు 1330 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్ కోసం వెబ్సైట్ www.tgsrtcbus.in ను సంప్రదించాలని సూచించారు.
News September 19, 2025
విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా గురు, శుక్రవారాల్లో 1053 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ లంగ్స్’ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. జోన్-1లో 40 ఆక్రమణలు, జోన్-2లో 86, జోన్ -3లో 71, జోన్-4లో 11, జోన్-5లో 58, జోన్-6లో 110, జోన్- 7లో 52, జోన్-8లో 40 ఆక్రమణలు తొలగించారు. శుక్రవారం ఒక్కరోజే 529 ఆక్రమణలు తొలగించారు.
News September 19, 2025
TU: అంతర్జాతీయంగా న్యాయశాస్త్ర పాత్ర ప్రతిష్టాత్మకమైనది: రిజిస్ట్రార్

అంతర్జాతీయంగా న్యాయశాస్త్ర పాత్ర అత్యంత ప్రతిష్టాత్మకమైనదని టీయూ రిజిస్ట్రార్ ప్రొ.ఎం.యాదగిరి అన్నారు. శుక్రవారం వర్సిటీ న్యాయ కళాశాలలో డా.జట్లింగ్ ఎల్లోసా ఆధ్వర్యంలో ‘United States Immigration System And Privte International Law’ అనే అంశంపై విస్తృత ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.శ్రీనివాస్ రావు కావేటి, డా.ఉత్తం, లా కాలేజ్ ప్రిన్సిపల్ డా.ప్రసన్న రాణి పాల్గొన్నారు.