News September 19, 2025
విద్యార్థుల విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలి: పీవో

సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న పాఠశాలు, ఆశ్రమ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నల్ జగన్నాథం అన్నారు. శుక్రవారం సీతంపేట ఐటీడీఏలో ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్స్, వార్డెన్‌లతో పీవో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని, పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పీవో సూచించారు.
Similar News
News September 19, 2025
నిజాంసాగర్: 10 గేట్లు ఎత్తి.. 69,702 క్యూసెక్కులు విడుదల

ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 69,702 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. శుక్రవారం రాత్రి ప్రాజెక్టులోకి 57,322 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16.559 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఒక వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
News September 19, 2025
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం. కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సిట్.. చాలామందిని విచారించి కీలక సమాచారం సేకరించింది. అటు ఇప్పటికే కాళేశ్వరం కేసును విచారించాలని CBIకి లేఖ రాసిన ప్రభుత్వం తాజాగా ఈ కేసునూ అప్పగించాలనుకోవడం వ్యూహాత్మక అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
News September 19, 2025
KMR: TLM మేళాలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాగరాజు

కామారెడ్డి జిల్లా FLN TLM మేళా ప్రదర్శనలో స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో SGT ఉపాధ్యాయుడు దాసరి నాగరాజు(Spl.Edu) ఉత్తమ ప్రదర్శన కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. దోమకొండ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయన వెనుకబడిన విద్యార్థులకు మెళుకువలు నేర్పేలా బోధనాభ్యాసన సామర్థ్యాలను తయారు చేశారు. ఈ మేరకు DEO రాజు ప్రశంసాపత్రం అందించారు.