News September 19, 2025
ADB: ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై సమీక్ష

విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ఈ సమావేశంలో పాల్గొని, విద్యార్థులు వేసిన డ్రాయింగ్‌లు, ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులు ఈ కార్యక్రమం వల్ల తమలో వచ్చిన మార్పులను వివరించారు. ఛాంపియన్ విద్యార్థుల సందేశాలను కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు సూచనలు చేశారు.
Similar News
News September 19, 2025
గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి కృషి చేయాలి: ADB ఎస్పీ

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. వీడీసీల ఆగడాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. రౌడీలు, కేడీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠినమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.
News September 19, 2025
అసాంఘిక కార్యకలాపాలను రూపమాపాలి: ADB ఎస్పీ

రానున్న నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్‌లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణను అవలంభించాలని సూచించారు. అందులో భాగంగానే కల్తీకల్లు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపమాపేలా కృషి చేయాలన్నారు.
News September 19, 2025
ADB: కలెక్టర్ సార్.. మీ కోసమే ఎదురుచూపులు

”స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లయినా మా గ్రామానికి రోడ్డు లేక నరకయతన పడుతున్నాం. విద్య, వైద్యం పొందలేక అవస్థలు పడుతున్నాం. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్ వెళ్లలేని పరిస్థితి. నిత్యవసరాలకీ నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేక పిల్లలు చదువులకు దూరమయ్యారు” అంటూ గుబిడి గ్రామస్థులు కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం చర్చనీయంగా మారింది. మండల పర్యటనకు రానున్న కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.