News September 19, 2025
విద్యార్థిని కొట్టిన హెచ్ఎం.. ఏలూరులో ఆందోళన

‘డీ’ అక్షరాన్ని సరిగ్గా పలకలేదన్న కారణంతో ఆరో తరగతి విద్యార్థి ఆహిల్‌ను ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొట్టిన ఘటన ఏలూరులోని తంగెళ్లమూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు శుక్రవారం పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని, ఆయన పద్ధతి మారలేదని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
News September 19, 2025
ఏలూరు: ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ఆమె వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోడౌన్‌కు పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఆమె తెలిపారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
News September 19, 2025
బీబీనగర్ చెరువులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

బీబీనగర్ చెరువులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని వరంగల్ జిల్లా అయినవోలుకు చెందిన సురేందర్‌గా పోలీసులు గుర్తించారు. అప్పుల బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబీకులు 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సురేందర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.