News September 19, 2025
సాయుధ పోరాటం ఆపబోం: మావోయిస్టులు

తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ పాటిస్తాం’ అని ఇటీవల అభయ్(సోనూ) పేరుతో లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతమంటూ మావోల అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నానని సోనూ ఎందుకు ప్రకటించాడో అర్థం కావట్లేదన్నారు. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
News September 19, 2025
బ్యాటింగ్‌కు రాని సూర్యకుమార్.. ఏమైంది?

ఆసియా కప్: ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్య కోసం చివరి వరకు అభిమానులు వెయిట్ చేశారు. ప్యాడ్లు ధరించి డగౌట్‌లో కనిపించిన SKY క్రీజులోకి ఎందుకు రాలేదని, ఆయనకు ఏమైందనే చర్చ SMలో జరుగుతోంది. కాగా, మిగతా ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలనే సూర్య బరిలోకి దిగలేదని తెలుస్తోంది.
News September 19, 2025
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం. కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సిట్.. చాలామందిని విచారించి కీలక సమాచారం సేకరించింది. అటు ఇప్పటికే కాళేశ్వరం కేసును విచారించాలని CBIకి లేఖ రాసిన ప్రభుత్వం తాజాగా ఈ కేసునూ అప్పగించాలనుకోవడం వ్యూహాత్మక అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.