News September 19, 2025

24న అంబేడ్కర్ వర్సిటీ MBA అడ్మిషన్స్ కౌన్సెలింగ్

image

TG: HYD అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను MBA(హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24న ఉదయం 9 గంటలకు CSTD బిల్డింగ్‌లో కౌన్సెలింగ్ ఉంటుందని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఐసెట్ లేదా వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో పాసైనవారే అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.braouonline.in సంప్రదించాలన్నారు.

Similar News

News September 19, 2025

వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

image

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.

News September 19, 2025

లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

image

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.

News September 19, 2025

బ్యాటింగ్‌కు రాని సూర్యకుమార్.. ఏమైంది?

image

ఆసియా కప్: ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్య కోసం చివరి వరకు అభిమానులు వెయిట్ చేశారు. ప్యాడ్లు ధరించి డగౌట్‌లో కనిపించిన SKY క్రీజులోకి ఎందుకు రాలేదని, ఆయనకు ఏమైందనే చర్చ SMలో జరుగుతోంది. కాగా, మిగతా ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలనే సూర్య బరిలోకి దిగలేదని తెలుస్తోంది.