News September 19, 2025
అంకిత భావ సేవలతో పని చేయాలి: కలెక్టర్

రెవెన్యూ అధికారులు నిబద్ధత అంకిత భావ సేవలతో పని చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో రెవెన్యూ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జీవో నంబర్ 55 ప్రకారం దసరా సందర్భంగా మండపాలు రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 19, 2025
ఆదిలాబాద్: ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్ ఎస్పీగా పదోన్నతి రాగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన కాజల్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.
News September 19, 2025
వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.