News September 19, 2025
BREAKING: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ తెలిపింది. రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని చెప్పింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Similar News
News September 19, 2025
వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
News September 19, 2025
బ్యాటింగ్‌కు రాని సూర్యకుమార్.. ఏమైంది?

ఆసియా కప్: ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్య కోసం చివరి వరకు అభిమానులు వెయిట్ చేశారు. ప్యాడ్లు ధరించి డగౌట్‌లో కనిపించిన SKY క్రీజులోకి ఎందుకు రాలేదని, ఆయనకు ఏమైందనే చర్చ SMలో జరుగుతోంది. కాగా, మిగతా ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలనే సూర్య బరిలోకి దిగలేదని తెలుస్తోంది.