News September 19, 2025
వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News September 20, 2025
శృంగవరపుకోటలో మెగా జాబ్ మేళా

ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.
News September 20, 2025
నస్పూర్: ఓటరు జాబితాలు పకడ్బందీగా నిర్వహించాలి

2002, 2025 ఓటరు జాబితాలను సరిపోల్చే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలన్నారు.
News September 20, 2025
మదనపల్లి: టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి

టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లిలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పనిచేసేందుకు వెలుతు తన కుమార్తె అలిజ(2)ను తీసుకెళ్లింది. చంద్రకాలనీ రీలింగ్ కేంద్రంలో వదలడంతో చిన్నారి నీళ్లు అనుకోని టార్పెంట్ ఆయిల్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది.