News September 19, 2025
నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే: MLA

రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని MLA కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. తాను ఎవరి దగ్గర మోకరిళ్లే వ్యక్తిని కాదని, కడియం శ్రీహరి ఎప్పుడూ ఐకాన్‌గానే ఉంటారని అన్నారు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కృషి చేశానని అన్నారు.
Similar News
News September 20, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.
News September 20, 2025
వికారాబాద్: కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలు అందించాలి: కలెక్టర్

జిల్లాలోని ఓటర్ల వివరాలను కేటగిరీల వారీగా సమర్పించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా నివేదికను వెంటనే తయారుచేయాలని సూచించారు. ఈ నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు.
News September 20, 2025
రేపు పేరుపాలెం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్: కలెక్టర్

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో శనివారం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ తీరప్రాంత మిషన్ పథకం కింద సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.