News September 19, 2025
ఉత్తమ పనికి రివార్డులు.. తప్పిదాలకు చర్యలు: KMR SP

కామారెడ్డి SP రాజేష్ చంద్ర శుక్రవారం పోలీసు కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఇటీవల వరదల సమయంలో సిబ్బంది చేసిన కృషిని ముఖ్యమంత్రి స్వయంగా అభినందించారని గుర్తు చేశారు. ఉత్తమ పని తీరుకు రివార్డులు, తప్పులకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హోంగార్డులకు రైన్‌కోట్లు, ఉలెన్ జెర్సీలను SP అందజేశారు.
Similar News
News September 20, 2025
RRB: NTPC CBT1 ఫలితాలు విడుదల

NTPC-2025 పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT1) ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షల కటాఫ్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ను <
News September 20, 2025
విజయనగరంలో హైకోర్టు జడ్జిల పర్యటన

విజయనగరంలో పర్యటన నిమిత్తం ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరు జడ్జిలను కలెక్టర్ ఎస్.రామ సుందర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News September 20, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.