News September 19, 2025
జూబ్లీహిల్స్‌లో ఆసక్తికరంగా కాంగ్రెస్ సమీకరణలు..!

HYD జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. శుక్రవారం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హామీ పేరుతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని డివిజన్ల నేతలతో అంజన్ కుమార్ యాదవ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ వద్ద నుంచి అంజన్ కుమార్ యాదవ్‌కు సానుకూల సంకేతాలు వచ్చాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Similar News
News September 19, 2025
HYD: తెలంగాణ సెక్రటేరియట్‌పై నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు

HYD ఖైరతాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సెక్రటేరియట్‌ను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సెక్రటేరియట్ పైనతోపాటు చుట్టూ ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
News September 19, 2025
HYD: BRS జైత్రయాత్రతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలి: KTR

420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ BRS జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం HYD తెలంగాణ భవన్‌లో ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని స్పష్టం చేశారు.
News September 19, 2025
HYD: మరోసారి హెచ్‌సీఏలో చెలరేగిన వివాదం..!

HYD క్రికెట్ అసోసియేషన్‌లో మరోసారి వివాదం చెలరేగింది. యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న దల్జిత్‌పై పలువురు క్లబ్ సెక్రటరీలు BCCIకి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 28న ముంబైలో జరుగనున్న 95వ BCCI ఏజీఎం సమావేశానికి హెచ్‌సీఏకు ఆహ్వానం అందినా దల్జిత్ హోదా నిబంధనలకు వ్యతిరేకమని క్లబ్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో జస్టిస్ నవీన్ రావ్ నేతృత్వంలోని సింగిల్ మెంబర్ కమిటీకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం