News September 19, 2025

ఆధార్ నమోదు లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 192 ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, అన్ని కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. 0-5 ఏళ్ల పిల్లలకు ఆధార్ నమోదు, 5-7 ఏళ్ల వారికి వేలిముద్రలు, 15-17 ఏళ్ల వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని ఆదేశించారు. ‘తల్లికి వందనం’ వంటి పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు.

Similar News

News September 20, 2025

కామారెడ్డి: 11 మందికి జైలు.. 22 మందికి జరిమానా

image

మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి కోర్టు మొత్తం 33 మందికి శిక్ష విధించింది. ఇందులో 11 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, 22 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.

News September 20, 2025

NZB: పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమలు: సీపీ

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు D.EI.ED సెకండ్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో BNSS సెక్షన్ 163 అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు D.EI.ED, 28 వరకు TOSS పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని వివరించారు.

News September 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.