News September 19, 2025

శ్రీకాకుళం: రామ్మోహన్ నాయుడును అభినందించిన లోకేశ్

image

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ <<17761800>>అభినందించారు<<>>. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్‌ను కేంద్ర మంత్రి దత్తతు తీసుకుంటానని వెల్లడించడంతో లోకేశ్ ఆయనను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను వారి ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు దత్తతు తీసుకుంటే ఆదర్శంగా ఉంటారన్నారు.

Similar News

News September 20, 2025

పలాస: తక్షణ పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి

image

ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాలుపై తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని SP మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా ఫిర్యాదు దారులుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ, ఆస్తి, పౌర సంబంధాలు, గొడవలు, మోసపూరితమైనవి, ఇతర అంశాలుపై ఫిర్యాదులు అందాయన్నారు.

News September 19, 2025

SKLM: దివ్యాంగుల నుంచి ఫిర్యాదుల స్వీకరించిన కేంద్ర మంత్రి

image

దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని వినతులు స్వీకరించారు. శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యల విని, పడుతున్న కష్టాలను చూసి ఆయన చలించిపోయారు. దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC, అధికారులు పాల్గొన్నారు.

News September 19, 2025

కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌‌‌కు తెలపాలన్నారు. 9492250069 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.