News September 19, 2025

సంగారెడ్డి: మెరిట్ జాబితా విడుదల: డీఈవో

image

కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిగా పనిచేసేందుకు ఏఎన్ఎం అకౌంటెంట్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జాబితా www.sangareddy.telangana.gov.inలో వచ్చినట్లు చెప్పారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 22లోపు ఆధారాలతో సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

బతుకమ్మ ఏర్పాట్లను ముమ్మరం చేయాలి: కలెక్టర్

image

బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో GWMC కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్ చర్చించారు. వేడుకలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని ఆమె తెలిపారు.

News September 20, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 20, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.26 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

News September 20, 2025

కామారెడ్డి: 11 మందికి జైలు.. 22 మందికి జరిమానా

image

మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి కోర్టు మొత్తం 33 మందికి శిక్ష విధించింది. ఇందులో 11 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, 22 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.