News September 19, 2025
సమస్యల పరిష్కారంపై CM దృష్టి పెట్టాలి: రాజగోపాల్‌రెడ్డి

TG: రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ‘స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి. మెజారిటీ MLAల అభిప్రాయం కూడా ఇదేనని భావిస్తున్నాను. సంక్షేమ పథకాలతో పాటు సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని CM గుర్తించి వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు. కాగా దీన్ని BRS నేత హరీశ్‌రావు రీట్వీట్ చేయడం గమనార్హం.
Similar News
News January 21, 2026
నేటి ముఖ్యాంశాలు

* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం
* నితిన్ నా బాస్.. నేను కార్యకర్తను మాత్రమే: మోదీ
* దావోస్‌లో గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
* ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలపాటు హరీశ్ రావును విచారించిన సిట్
* హరీశ్ విచారణపై INC-BRS నేతల మధ్య డైలాగ్ వార్
* పెండింగ్ చలాన్లపై బలవంతం చేయొద్దు: TG హైకోర్టు
* ఇవాళ రూ.22వేలు పెరిగిన కేజీ వెండి ధర, రూ.1.52లక్షలకు చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
News January 21, 2026
మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్‌మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్‌మెరైన్‌లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.
News January 21, 2026
ముంబైపై ఢిల్లీ ఘన విజయం

WPL: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51*), లీ(46) చెలరేగడంతో 155 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అమన్‌జోత్ కౌర్, వైష్ణవికి చెరో వికెట్ దక్కింది. ముంబై బ్యాటర్లలో బ్రంట్(65), హర్మన్ ప్రీత్(41) మాత్రమే రాణించారు.


