News September 19, 2025

అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: MLA

image

అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పోలీసు, రెవెన్యూ, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా రవాణా చేయాలన్నారు.

Similar News

News September 20, 2025

ములుగు: బోనస్ కోసం రైతుల ఎదురు చూపు?

image

ములుగు జిల్లాలో వరి ధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు కావస్తున్నా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. బోనస్‌కు ఆశపడి సన్నధాన్యం పండించామని అంటున్నారు. దసరాకు అయినా బోనస్ అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు 11,379 మంది రైతులకు రూ.30 కోట్లకు పైగా బోనస్ చెల్లించాల్సి ఉంది.

News September 20, 2025

సెప్టెంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

✒ 1924: నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు(ఫొటోలో) జననం
✒ 1933: హోంరూల్ ఉద్యమ నేత అనీ బిసెంట్ మరణం
✒ 1948: బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు
✒ 1954: ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
✒ 1999: తమిళ నటి టి.ఆర్.రాజకుమారి మరణం
✒ రైల్వే భద్రతా దళ(RPF) వ్యవస్థాపక దినోత్సవం

News September 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.