News September 19, 2025

HYD: BRS జైత్రయాత్రతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలి: KTR

image

420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ BRS జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం HYD తెలంగాణ భవన్‌లో ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని స్పష్టం చేశారు.

Similar News

News September 20, 2025

HYD: త్వరలో నాలా పక్కన కబ్జాల తొలగింపు: రంగనాథ్

image

గ్రేటర్ HYDలో ప్రధాన కబ్జాల తొలగింపు చర్యలు త్వరలో ప్రారంభం కానున్నాయి. నాలాలను ఆక్రమించిన నిర్మాణాల వల్ల వరద నీరు సాఫీగా పోకుండా సమస్యలు తలెత్తుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ బృందం గుర్తించింది. నాలా ప్రవాహానికి అడ్డంకిగా మారిన ముఖ్యమైన నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని రంగనాథ్ వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించి పరిహార చర్యలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

News September 20, 2025

HYD: గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లను సమన్వయంతో సమయానికి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జి.ముకుంద రెడ్డి సూచించారు. అక్టోబర్ 2న లంగర్‌హౌస్ బాపూఘాట్‌లో గవర్నర్, సీఎం, మంత్రులు నివాళులు అర్పించనున్నారని తెలిపారు. విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, మెడికల్, భద్రతా ఏర్పాట్లపై సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాంతోపాటు అధికారులతో ఆయన కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News September 19, 2025

HYD: తెలంగాణ సెక్రటేరియట్‌పై నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు

image

HYD ఖైరతాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సెక్రటేరియట్‌ను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సెక్రటేరియట్ పైనతోపాటు చుట్టూ ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.