News September 19, 2025

HYD: BRS జైత్రయాత్రతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలి: KTR

image

420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ BRS జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం HYD తెలంగాణ భవన్‌లో ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని స్పష్టం చేశారు.

Similar News

News September 20, 2025

AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

image

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్‌కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.

News September 20, 2025

కామారెడ్డి: ‘దసరా సెలవుల్లో మార్పు చేయాలి’

image

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను మార్పు చేయాలని రాష్ట్ర జూనియర్ లెక్చలర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం పంపించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు దసరా సెలవులు జూనియర్ కళాశాలలకు ప్రకటించాలని కోరారు. ముందుగా ప్రకటించిన 28వ తేదీని వెంటనే మార్పు చేయాలన్నారు.

News September 20, 2025

ములుగు: బోనస్ కోసం రైతుల ఎదురు చూపు?

image

ములుగు జిల్లాలో వరి ధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు కావస్తున్నా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. బోనస్‌కు ఆశపడి సన్నధాన్యం పండించామని అంటున్నారు. దసరాకు అయినా బోనస్ అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు 11,379 మంది రైతులకు రూ.30 కోట్లకు పైగా బోనస్ చెల్లించాల్సి ఉంది.