News September 19, 2025
సింగరేణి సంస్థ C&MDకి అత్యుత్తమ పురస్కారం

సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న సీఅండ్‌ఎండీ బలరాం నాయక్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఏషియా పసిఫిక్ హెచ్‌ఆర్‌ఎం (HRM) కాంగ్రెస్ వారు ఆయనను దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ సంస్థల కేటగిరీలో సీఅండ్‌ఎండీగా గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశారు. గురువారం రాత్రి బెంగుళూరులో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
Similar News
News September 20, 2025
AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్‌కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.
News September 20, 2025
కామారెడ్డి: ‘దసరా సెలవుల్లో మార్పు చేయాలి’

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను మార్పు చేయాలని రాష్ట్ర జూనియర్ లెక్చలర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం పంపించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు దసరా సెలవులు జూనియర్ కళాశాలలకు ప్రకటించాలని కోరారు. ముందుగా ప్రకటించిన 28వ తేదీని వెంటనే మార్పు చేయాలన్నారు.
News September 20, 2025
ములుగు: బోనస్ కోసం రైతుల ఎదురు చూపు?

ములుగు జిల్లాలో వరి ధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు కావస్తున్నా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. బోనస్‌కు ఆశపడి సన్నధాన్యం పండించామని అంటున్నారు. దసరాకు అయినా బోనస్ అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు 11,379 మంది రైతులకు రూ.30 కోట్లకు పైగా బోనస్ చెల్లించాల్సి ఉంది.