News September 19, 2025
ఏలూరు: ఆక్వా రైతులతో జిల్లా కలెక్టర్ సమావేశం

ఏలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆక్వా, చేపల చెరువుల రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు విద్యుత్ సమస్యలు, సర్ చార్జి, అడిషనల్ చార్జి, అధిక బిల్లుల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. చెరువులకు అప్రోచ్ రోడ్ల నిర్మాణాల గురించి వారు ప్రస్తావించారు.
Similar News
News September 20, 2025
MDK: పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను బలంగా చేస్తే, కాంగ్రెస్ కుప్ప కూల్చిందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లకు డిజిల్ పోయించే డబ్బులు లేక మూలన పడేసిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. బతుకమ్మ పండుగ పూట కూడా వీధిదీపాలు వెలగక గ్రామాలు చీకటిలో ఉన్నాయని పేర్కొన్నారు.
News September 20, 2025
AI వినియోగం పట్ల జాగ్రత్తలు పాటించాలి: MP కావ్య

సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ పట్ల బాలికలు జాగ్రత్తలు పాటించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. కేయూలో బతుకమ్మ వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. విద్యార్థినులు అనుకున్నది సాధించాలంటే క్రమశిక్షణ, కష్టపడి చదవడం అవసరమని ఎంపీ సూచించారు. విద్యార్థినుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
News September 20, 2025
AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్‌కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.