News September 19, 2025

TU: క్రీడాకారులు యూనివర్సిటీకి గుర్తింపును తేవాలి: రిజిస్ట్రార్

image

టీయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ (పురుషుల) ఎంపిక పోటీలను శుక్రవారం ప్రారంభించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొ.యం.యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. వర్సిటీలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే.. సౌకర్యాల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డా.ప్రవీణ్, డా.పున్నయ్య పాల్గొన్నారు.

Similar News

News September 20, 2025

NZB: పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమలు: సీపీ

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు D.EI.ED సెకండ్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో BNSS సెక్షన్ 163 అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు D.EI.ED, 28 వరకు TOSS పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని వివరించారు.

News September 20, 2025

దసరా సెలవులకు ఊరేళ్తున్నారా? జాగ్రత్త: NZB CP

image

దసరా సందర్భంగా ఊరికి వెళ్లే వారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలన్నారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. ఖరీదైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిదన్నారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.

News September 19, 2025

TU: అంతర్జాతీయంగా న్యాయశాస్త్ర పాత్ర ప్రతిష్టాత్మకమైనది: రిజిస్ట్రార్

image

అంతర్జాతీయంగా న్యాయశాస్త్ర పాత్ర అత్యంత ప్రతిష్టాత్మకమైనదని టీయూ రిజిస్ట్రార్ ప్రొ.ఎం.యాదగిరి అన్నారు. శుక్రవారం వర్సిటీ న్యాయ కళాశాలలో డా.జట్లింగ్ ఎల్లోసా ఆధ్వర్యంలో ‘United States Immigration System And Privte International Law’ అనే అంశంపై విస్తృత ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.శ్రీనివాస్ రావు కావేటి, డా.ఉత్తం, లా కాలేజ్ ప్రిన్సిపల్ డా.ప్రసన్న రాణి పాల్గొన్నారు.