News September 19, 2025

అనంతపురంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అనంతపురం నగర శివారులోని సోమలదొడ్డి వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 20, 2025

సంగారెడ్డి: నామినేషన్ల గడవు పొడిగింపు

image

ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల గడవును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక నామినేషన్లు సమర్పించిన జిల్లాగా సంగారెడ్డిని నిలిపేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని కోరారు. ఇంకా నామినేషన్లు పంపనివారు ఈ గడువులోగా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 20, 2025

నిర్మల్: ‘ఎంప్లాయిమెంట్ కార్డు దరఖాస్తు చేసుకోండి’

image

ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ కార్డు తప్పనిసరి అని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఐ.గోవింద్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు తమ శాఖ మంచి అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయాన్ని లేదా మీ-సేవ/ఆన్‌లైన్ కేంద్రాలను సంప్రదించవచ్చని సూచించారు.

News September 20, 2025

చకచకా చరణ్-సుకుమార్ మూవీ స్క్రిప్ట్ వర్క్

image

రామ్ చరణ్-బుజ్జిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత సుకుమార్-చెర్రీ మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్, ప్రీవిజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ మాత్రమే కాకుండా.. నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నారు.