News September 19, 2025

నెల్లూరు: గూడ్స్ రైలు కింది పడిన స్నేహితులు

image

నెల్లూరులోని వెంకటేశ్వరపురం మూడో రైల్వే లైనుపై ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. రైల్వే SI హరిచందన వివరాలు.. చిత్తూరు(D) పూతలపట్టుకు చెందిన ఉమేష్ చంద్ర(25), పొదలకూరుకు చెందిన వంశీ స్నేహితులు. వీరు గూడ్స్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉమేష్ చంద్ర మృతిచెందగా, వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చేర్పించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 20, 2025

ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల మౌలిక వసతుల కల్పనకు అడ్డంకులు ఉండవన్నారు.

News September 20, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటమే జిల్లా యంత్రాంగం ప్రధమ కర్తవ్యం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విపత్తుల సమయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా కాపాడేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు.

News September 19, 2025

నెల్లూరు జిల్లాలో వేగంగా MSME పార్కులు

image

సీఎం చంద్రబాబు విజన్-2047లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ లేదా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆత్మకూరు నారంపేటలో పారిశ్రామికవాడ, నెల్లూరు అర్బన్‌ భగత్‌సింగ్ కాలనీలో రూ.12 కోట్లతో జీ+2 ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుండగా, ఆమంచర్లలో 59 ఎకరాల్లో MSME పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపాదన దశలో ఉన్నాయి.