News September 19, 2025
SC అభ్యర్థులకు TSLPRB గుడ్‌న్యూస్!

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే SC అభ్యర్థులకు TSLPRB ఊరటనిచ్చింది. కొత్త సబ్-క్లాసిఫికేషన్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడంతో ప్రస్తుతానికి పాత వాటితోనే అప్‌లోడ్ చేయొచ్చని తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కొత్తవి సమర్పించాలంది. లేకపోతే రిజర్వేషన్ వర్తించదని హెచ్చరించింది. OCT 5 చివరి తేదీ కాబట్టి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Similar News
News September 20, 2025
పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి: పవన్

AP: గ్రామ పంచాయతీల్లో గతంలో అమలులో ఉన్న లోపభూయిష్ట విధానాల ప్రక్షాళన అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల పునర్వర్గీకరణ, నూతన విధానాల అమలుపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. 48 ఏళ్లనాటి సిబ్బంది నమూనాకు మార్పులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆదాయం, జనాభా, ప్రాంతం ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు నిర్ణయించనున్నారు. క్యాబినెట్ ముందుకు త్వరలో నూతన విధానాలు తీసుకెళ్లనున్నారు.
News September 20, 2025
చకచకా చరణ్-సుకుమార్ మూవీ స్క్రిప్ట్ వర్క్

రామ్ చరణ్-బుజ్జిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత సుకుమార్-చెర్రీ మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్, ప్రీవిజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ మాత్రమే కాకుండా.. నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నారు.
News September 20, 2025
ఒమన్ అద్భుత ప్రదర్శన.. పాక్‌కు చురకలు!

ఆసియా కప్: టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్ జట్టు అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో శభాష్ అనిపించుకుంది. చివరి వరకు పోరాడి 21 రన్స్ తేడాతో <<17767421>>ఓడిపోయింది<<>>. ఈ నేపథ్యంలో ఒమన్ జట్టును చూసి పాక్ చాలా నేర్చుకోవాలని నెటిజన్స్ చురకలు అంటిస్తున్నారు. చిన్న జట్టు అయినా తమ పోరాటంతో హృదయాలు గెలిచిందని కామెంట్స్ చేస్తున్నారు.