News September 19, 2025

ASIA CUP: భారత్ స్కోర్ ఎంతంటే?

image

ఒమన్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డును ఆగనివ్వలేదు. శాంసన్ 56, అభిషేక్ 38, తిలక్ 29, అక్షర్ 26 రన్స్ చేశారు. ఒమన్ బౌలర్లలో ఫైజల్, కలీమ్, జితెన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. మరి ఒమన్‌ను IND ఎన్ని పరుగులకు కట్టడి చేస్తుంది? COMMENT

Similar News

News September 20, 2025

చకచకా చరణ్-సుకుమార్ మూవీ స్క్రిప్ట్ వర్క్

image

రామ్ చరణ్-బుజ్జిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత సుకుమార్-చెర్రీ మూవీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్, ప్రీవిజువలైజేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ మాత్రమే కాకుండా.. నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నారు.

News September 20, 2025

ఒమన్‌ అద్భుత ప్రదర్శన.. పాక్‌కు చురకలు!

image

ఆసియా కప్: టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్ జట్టు అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో శభాష్ అనిపించుకుంది. చివరి వరకు పోరాడి 21 రన్స్ తేడాతో <<17767421>>ఓడిపోయింది<<>>. ఈ నేపథ్యంలో ఒమన్ జట్టును చూసి పాక్ చాలా నేర్చుకోవాలని నెటిజన్స్ చురకలు అంటిస్తున్నారు. చిన్న జట్టు అయినా తమ పోరాటంతో హృదయాలు గెలిచిందని కామెంట్స్ చేస్తున్నారు.

News September 20, 2025

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: TTD

image

AP: 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు TTD EO అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బందిలేకుండా సూక్ష్మ-క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉ.8-10 గం. వరకు, రా.7-రా.9 గం. వరకు వాహన సేవలు. సా.6.30- రాత్రి 12 గంటల వరకు గరుడసేవ ఉంటుందన్నారు. ధ్వజారోహణం(SEP 24) రోజు CM చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.