News September 19, 2025

బీబీనగర్ చెరువులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

బీబీనగర్ చెరువులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని వరంగల్ జిల్లా అయినవోలుకు చెందిన సురేందర్‌గా పోలీసులు గుర్తించారు. అప్పుల బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబీకులు 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సురేందర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

Similar News

News September 20, 2025

బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్

image

AP: SEP 26, 27, 28 తేదీల్లో బాపట్ల(D) సూర్యలంక బీచ్‌లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, VJA, TPT, RJY, GNT, HYDలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు. బీచ్ ఫెస్టివల్‌లో వాటర్ స్పోర్ట్స్, సీ పుడ్ ఆకర్షణగా నిలువనున్నాయి.

News September 20, 2025

ములుగు: విధి వింతాట.. సరిహద్దు నుంచి స్వగ్రామానికి..!

image

దేశ రక్షణ కోసం సరిహద్దులో పహారా కాస్తున్న ఓ జవాను పండుగకు సెలవులపై ఇంటికి సంతోషంగా వద్దామనుకున్నాడు. తీరా, విధి విషాదం నింపింది. మృతి చెందిన భార్యను కడసారి చూసుకునేందుకు వచ్చేలా చేసింది. ములుగు జిల్లా దేవగిరి పట్నంకు చెందిన ఐటీబీపీ హవల్దార్ శ్రీను భార్య ప్రీతి అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో గ్రామానికి వచ్చిన శ్రీను ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.

News September 20, 2025

జగిత్యాల: ‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి’

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై జగిత్యాల కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 10,775 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. 7,261 మార్కౌట్, 2,569 బేస్మెంట్ స్థాయిలో, 428 గోడల నిర్మాణం వరకు 165 స్లాబ్ దశకు రాగ ఒక ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుందని కలెక్టర్ తెలిపారు.