News September 20, 2025
వికారాబాద్: కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలు అందించాలి: కలెక్టర్

జిల్లాలోని ఓటర్ల వివరాలను కేటగిరీల వారీగా సమర్పించాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా నివేదికను వెంటనే తయారుచేయాలని సూచించారు. ఈ నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు.
Similar News
News September 20, 2025
కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన ఆసుపత్రిలో శుక్రవారం అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. 65 ఏళ్ల ఓ మహిళ శరీరం నుంచి 8kgల కాంప్లెక్స్ ఒవేరియన్ ట్యూమర్ తొలగించారు. సింగరేణి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందం కంబైన్డ్ స్పెషల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా కింద నిర్వహించారు. వైద్య సిబ్బందిని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ అభినందించారు.
News September 20, 2025
సంగారెడ్డి: 21 నుంచి దసరా సెలవులు: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 21 నుంచి OCT 3 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించిందని డీఈఓ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. దసరా సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 20, 2025
బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్

AP: SEP 26, 27, 28 తేదీల్లో బాపట్ల(D) సూర్యలంక బీచ్‌లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, VJA, TPT, RJY, GNT, HYDలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు. బీచ్ ఫెస్టివల్‌లో వాటర్ స్పోర్ట్స్, సీ పుడ్ ఆకర్షణగా నిలువనున్నాయి.