News September 20, 2025
రాష్ట్రంలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

TG: రాష్ట్ర ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. ఆస్పత్రులు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాజనర్సింహ తెలిపారు.
Similar News
News September 20, 2025
నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలి?

ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూడటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మన అరచేతిలో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవి(పార్వతి) కొలువై ఉంటారని అంటున్నారు. చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి, మూలంలో పార్వతీ దేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకోవడం, వాటిని కళ్లకు అద్దుకోవడం ద్వారా ఆ ముగ్గురు దేవతల ఆశీస్సులు లభించి, అదృష్టం వరిస్తుందని నమ్మకం.
News September 20, 2025
ప్రార్థన ఎలా చేయాలి?

ప్రార్థన అంటే నోటితో పలికే మాట కాదు. అది మనసులో నుంచి రావాలి. ఈ దైవ స్ఫురణలో ప్రేమ, భక్తి జాలువారాలి. అప్పుడే మనసులోని చీకటి తొలగిపోయి, దైవ కాంతి ప్రకాశిస్తుంది. మన కోర్కెలు తీర్చే ఆ భగవంతుడికి మనం ఏమి కోరుతామో ముందే తెలుస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఆయనను ఏదీ అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏది ఇస్తే అది మనకు మహద్భాగ్యమని భావించాలి. ఇదే నిజమైన ప్రార్థన.
News September 20, 2025
బీచ్ ఫెస్టివల్ ప్రమోట్ చేసేలా ఫ్లాష్ మాబ్

AP: SEP 26, 27, 28 తేదీల్లో బాపట్ల(D) సూర్యలంక బీచ్‌లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు వినూత్న ప్రచారం కల్పించేందుకు టూరిజం శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని వర్సిటీల భాగస్వామ్యంతో సూర్యలంక, VJA, TPT, RJY, GNT, HYDలో ఫ్లాష్ మాబ్ నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొన్న విద్యార్థులను SEP 27న వరల్డ్ టూరిజం డే రోజు CM చంద్రబాబు సత్కరిస్తారు. బీచ్ ఫెస్టివల్‌లో వాటర్ స్పోర్ట్స్, సీ పుడ్ ఆకర్షణగా నిలువనున్నాయి.