News September 20, 2025

TODAY HEADLINES

image

* ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా: CM CBN
* ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్
* ఈనెల 22 నుంచి OCT 2 వరకు దసరా సెలవులు: మంత్రి లోకేశ్
* మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేవరకు పోరాటం ఆగదు: జగన్
* ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది: KTR
* టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
* ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ కన్నుమూత

Similar News

News February 5, 2026

AI ఎఫెక్ట్.. ఉద్యోగం కోల్పోయిన శశిథరూర్ కుమారుడు

image

అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని (300+) ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో కాంగ్రెస్ MP శశిథరూర్ తనయుడు ఇషాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన SMలో వెల్లడించారు. ‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్‌ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్‌ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.

News February 5, 2026

బంధంలో ఇది ముఖ్యం

image

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

News February 5, 2026

గొడవలు ఎందుకొస్తాయంటే?

image

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్‌గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.