News September 20, 2025

భారత్‌పై పోరాడి ఓడిన ఒమన్

image

ఆసియా కప్: ఒమన్‌పై టీమ్ ఇండియా 21 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది. శాంసన్(56) రాణించారు. ఒమన్ బౌలర్లలో ఫైసల్, జితెన్, కలీమ్‌ తలో 2 వికెట్లు తీశారు. ఒమన్ 20 ఓవర్లలో 167/4 రన్స్ చేసింది. కలీమ్(64), మీర్జా(51), జితేందర్(32) మెప్పించారు. హర్షిత్ రాణా, కుల్దీప్‌, హార్దిక్, అర్షదీప్‌లు తలో వికెట్ తీశారు. అద్భుత ప్రదర్శనతో ఒమన్ హృదయాలు గెలిచింది.

Similar News

News September 20, 2025

పాల ప్రొడక్టుల ధరలు తగ్గింపు

image

AP: GST తగ్గడంతో తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు సంగం, విజయ డెయిరీలు ప్రకటించాయి. సంగం డెయిరీ UHT పాలు లీటరుపై రూ.2, పనీర్ కిలో రూ.15, నెయ్యి-వెన్న కిలోకి రూ.30, బేకరి ప్రొడక్టులు కిలోపై రూ.20 మేర తగ్గించనుంది. విజయ డెయిరీ టెట్రాపాలు లీటరు రూ.5, ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుకు రూ.5, పన్నీర్ కిలో రూ.20, వెన్న-నెయ్యిపై కిలోకి రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు SEP 22 నుంచి అమలులోకొస్తాయి.

News September 20, 2025

నేడు మాచర్లకు సీఎం చంద్రబాబు

image

AP: నేడు CM చంద్రబాబు పల్నాడు(D) మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.10.30 గం.కు మాచర్లకు చేరుకుని స్థానిక చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టనున్నారు. హెల్త్ క్యాంపులో సఫాయి కర్మచారీలతో మాట్లాడనున్నారు. మున్సిపాల్టీలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు రూ.2 కోట్ల చెక్కు అందించనున్నారు. మున్సిపల్ కమిషనర్లు, పాఠశాలల ప్రతినిధులను సన్మానించనున్నారు.

News September 20, 2025

నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలి?

image

ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూడటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మన అరచేతిలో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవి(పార్వతి) కొలువై ఉంటారని అంటున్నారు. చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి, మూలంలో పార్వతీ దేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకోవడం, వాటిని కళ్లకు అద్దుకోవడం ద్వారా ఆ ముగ్గురు దేవతల ఆశీస్సులు లభించి, అదృష్టం వరిస్తుందని నమ్మకం.