News September 20, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటమే జిల్లా యంత్రాంగం ప్రధమ కర్తవ్యం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విపత్తుల సమయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా కాపాడేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు.
Similar News
News September 20, 2025
TDPలో చేరిన MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి

MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది వరకే ఆయన YCPకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు CM చంద్రబాబు కండువా కప్పి TDPలోకి ఆహ్వానించారు. సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన వెంట సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, పులివర్తి నాని ఉన్నారు.
News September 20, 2025
వాహన మిత్ర పథకం దరఖాస్తు గడువు పెంపు – కలెక్టర్

వాహన మిత్ర పథకం దరఖాస్తు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు. గతంలో (2023 వరకు) ఈ పథకం కోసం దరఖాస్తు చేసిన వారు మరలా చేయాల్సిన అవసరం లేదన్నారు.
News September 20, 2025
ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల మౌలిక వసతుల కల్పనకు అడ్డంకులు ఉండవన్నారు.